శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని యంసిపీఐ(యు)జాతీయ కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. మియాపూర్ లో ప్రశాంత్ నగర్ లోని ఆమె నివాసంలో యంసిపిఐ (యు )పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మద్ది కాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ సుగుణమ్మ సామాన్య ప్రజలచే ఆయుధం పట్టించి ఆత్మగౌరవ పోరాటం నిర్వహించి పది లక్షల ఎకరాల భూమిని పంచేలా చేశారని అన్నారు. మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాల ఏర్పాటు చేసిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన నాయకత్వం అని అన్నారు. అలాగే రక్షణ కేంద్రం నిర్వహణ సభ్యురాలుగా ఉండి అనేక సాహస కార్యక్రమాలకు నేతృత్వం వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో యంసిపీఐ(యు) పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గదాగోని రవి, కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, పస్కుల మట్టయ్య, గోనె కుమార స్వామి, ఏ.హంసారెడ్డి,పెద్దాపురం రమేష్, తుకారం నాయక్, మంద రవి,కే సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, తాండ్ర కళావతి, ఇస్లావత్ దశరథ్ నాయక్,పి భాగ్యమ్మ, కర్ర దానయ్య, బి విమల, శివాని తదితరులు పాల్గొన్నారు.