శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని మియాపూర్ లోని ఓంకార్ నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో నిర్వహిస్తున్న ఎన్జీవో స్కూల్ లో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పి.చంద్రిక ప్రసాద్ పాల్గొని చిన్నారుల మధ్య రాహుల్ గాంధీ జన్మదిన కేక్ కట్ చేసి చాక్లెట్స్ పంపిణీ చేశారు.