శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): భారత వికాస్ పరిషత్ ఉపాధ్యక్షుడు, హమ్ సబ్ ఏక్ హై స్వచ్ఛంద సంస్థ చైర్మన్ బాల్ద అశోక్ తన జన్మదిన వేడుకను పేద విద్యార్థుల నడుమ జరుపుకున్నారు. శేరిలింగంపల్లిఓని కొత్తగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఆయన తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పాఠశాల విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదినాన్ని ఇలా జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. పేద విద్యార్థులు అయినప్పటికీ చదువుల్లో మాత్రం పేదరికం అడ్డు కాదని ఆ చిన్నారులు నిరూపించారని అన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఐపీఎస్ జె.బ్రహ్మా రెడ్డి, కాకినాడ జేఎన్‌టీయూకు చెందిన ప్రముఖ సివిల్ ఇంజినీర్ శ్రీనివాస రాజు, ప్రధానోపాధ్యాయుడు రాములు, బీవీపీ ఉపాధ్యక్షుడు ఫణి కుమార్, కార్యదర్శి శ్రీనివాస రావు, స్వామి నాయుడు, ఝాన్సీ, వరలక్ష్మి, ఇతర సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.