శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని తారానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకాష్ ఎడ్యుకేషన్ సెంటర్, CMS కాలేజ్ నూతన బ్రాంచ్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తారానగర్ లో ఆకాష్ ఎడ్యుకేషన్ సెంటర్, CMS కాలేజ్ నూతన బ్రాంచ్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆకాష్, CMS విద్యా సంస్థలు అగ్రగామిగా ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి దోహదపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ దక్షిణ ఆపరేషన్ హెడ్ నిశాంత్ శ్రీ వత్సవ, చీఫ్ ఆకాడమిక్ బిజినెస్ హెడ్ అమిత్ కుమార్ ఉరిటి, CMS కాలేజ్ చైర్మన్ చంద్రశేఖర్, నాయకులు మారబోయిన రాజు యాదవ్ , నాగరాజు, మల్లేష్ యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, శశాంక్, పవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.