శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ సమగ్ర, సంతులిత, అభివృద్దే తన ధ్యేయం అని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని హెచ్ఏఎల్ కాలనీలో హెచ్ఎండిఏ నిధులు రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, పీఏసీ ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రతీ కాలనీలో మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని, స్థానికవాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని, డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఏఈ క్రాంతికిరణ్, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, గోపాల్ యాదవ్, హాల్ కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ పరశురామ్, జనరల్ సెక్రటరీ సిద్దయ్య, శంకర్, నరేంద్ర, కిషోర్, సుబ్బారెడ్డి, లింగారెడ్డి, మల్లేష్ యాదవ్, పవన్, శశాంక్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.