శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): జలమండలి విభాగంలో మాదాపూర్ డివిజన్ GM కృష్ణ, హఫీజ్‌పేట్ డివిజన్ GM శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి డివిజన్ GM హరి కృష్ణ నూతనంగా నియమితులైన సందర్భంగా వివేకానంద నగర్ లోని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్లకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ప్రజలకు మంచి పనులు చేస్తూ గుర్తింపు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM శరత్ రెడ్డి, DGM అమీరుద్దీన్, DGM నాగప్రియ, DGM నరేందర్ రెడ్డి, మేనేజర్లు శ్రీహరి, సునీత తదితరులు పాల్గొన్నారు.