మందకృష్ణ మాదిగను పరామర్శించిన ప్రొ. పీవై రమేష్‌ బృందం

నమస్తే శేరిలింగంపల్లి:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ను తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు, అంబేద్కర్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ పివై రమేష్ బుధవారం ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. మందకృష్ణ మాదిగ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా పీవై రమేష్ ఆకాంక్షించారు. ఆయన వెంట అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రో.డా. కొరాని రవీందర్, అంబేద్కర్ సంఘం శేరిలింగంపల్లి గౌరవ అధ్యక్షులు కోడిచెర్ల రాము, శేరిలింగంపల్లి అధ్యక్షుడు జల్లే విజయ్ తదితరులు మందకృష్ణ మాదిగను కలిశారు.

మందకృష్ణ ‌మాదిగను కలిసి పరామర్శిస్తున్న ప్రొ. పీవై రమేష్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here