శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని శారదా నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శారదా నగర్ కాలనీ సిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శారదా నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ త్రినాద్ అట్లూరి, వైస్ ప్రెసిడెంట్ రమేష్ తిప్పర్తి, జనరల్ సెక్రెటరీ రంగారావు పరుచూరి, జాయింట్ సెక్రెటరీ శ్రీదేవి పొలు, ట్రెజరర్ వీరయ్య వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.