శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, టిపిసిసి ప్రధాన కార్యదర్శ జగదీశ్వర్ గౌడ్ నేతృత్వంలో కేక్ కట్ చేసి జిహెచ్ఎంసీ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. భారతదేశపు కీర్తిని నలుమూలల చాటి చెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ మనవడిగా, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దేశాన్ని ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధి చేసిన నేత రాజీవ్ గాంధీ బిడ్డగా రాహుల్ గాంధీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు.
గాంధీ కుటుంబం దేశానికి చేసిన నిరుపమాన సేవలు నాటితరం నాయకులే కాదు నేటి తరం నాయకులకు కూడా స్ఫూర్తిదాయకం అని తెలిపారు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిలువ నీడనిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, మారబోయిన అనిల్ కుమార్ యాదవ్, రఘుపతి రెడ్డి, వీరేందర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అలీ, మరెలా శ్రీనివాస్, బాష్పక యాదగిరి, విద్య కల్పన ఏకాంత్ గౌడ్, మన్నెపల్లి సాంబశివరావు, యాలమంచి ఉదయ్, రవి, డివిజన్ అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, డిసిసి నాయకులు,సేవాదళ్ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.