శేరిలింగంపల్లి, జూన్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మియాపూర్ డివిజన్ మయూరి నగర్ పార్క్ లో నిర్వహించనున్న యోగ కార్యక్రమం నేపథ్యంలో భారతీయ పార్టీ సీరియల్ నాయకుడు పట్టాభిరామ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు, పురుషులకు టీ షర్ట్స్ అందించే కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ జీవితం ఆరోగ్యంగా, నిత్యం ఉషారుగా, అనారోగ్యం రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం ఒక గంట సేపు యోగాసనాలు వేసి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలని సూచించారు. శనివాం జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, లక్ష్మణ్ ముదిరాజ్, మహేష్ యాదవ్, గణేష్, ఆంజనేయులు సాగర్, శ్రీనివాస్, అరవింద్, రాము , రాజేందర్ పాల్గొన్నారు.