శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయిశ్రీకి టీపీవైసీ సోషల్ మీడియా కో కన్వీనర్ దుర్గం శ్రీహరి గౌడ్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సోషల్ మీడియా ఉన్నది వాక్ స్వాతంత్ర్యం కోసమే కానీ తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు కాదని అన్నారు.