నేషనల్ ఇండియన్ టీం స్క్వాడ్ కి మాస్టర్ రోహిత్

  • అభినందించిన సత్కరించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
మాస్టర్ రోహిత్ ను శాలవ తో సత్కరించి ప్రత్యేకంగా అభినందించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగిన 65వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ రైఫిల్ ఈవెంట్ లో కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ కుమారుడు మాస్టర్ రోహిత్ పాల్గొని 50 మీటర్స్ రెఫరల్ ప్రోన్ పొజిషన్ జూనియర్స్ నందు ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ లో నిలిచాడు. నేషనల్ ఇండియన్ టీం స్క్వాడ్ కి ఎంపికయ్యాడు, ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులోభాగంగా మాస్టర్ రోహిత్ ను శాలవ తో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రైఫిల్ ఈవెంట్ లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మాస్టర్ రోహిత్ మన ప్రాంతపు బిడ్డ కావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. తల్లిదండ్రులు పిల్లల్లో దాగిన నైపుణ్యాని గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని  పేర్కొన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు సైదేశ్వర్ రావు, రమేష్ పటేల్, శ్రీనివాస్ చౌదరీ, తిరుపతి, రజినీకాంత్, లక్ష్మీ పాల్గొన్నారు.

రైఫిల్ చేతబట్టిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here