శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన అవగాహన కరపత్రాన్ని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లహరి ఎస్టేట్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రవీంద్ర కుమార్, CMO, HCU హెల్త్ సెంటర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ లు విచ్చేసి కరపత్రాన్ని విడుదల చేసి అనంతరం మాట్లాడుతూ మనకున్న ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం వంటి మూడు కాలాలలో వర్షాకాలంలో వ్యాధులు (సీజనల్ డిసీజెస్) ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా అతిసారం, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు వ్యాధి, కోవిడ్25 వేరియంట్ లాంటి వ్యాధులు విజృంభిస్తాయని తెలిపారు. మానవుడు జీవితంలో తను అనుకున్నది సాధించాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కనుక కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతులలోనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారబోయిన సదానంద యాదవ్, సభ్యులు G.V. రావు, శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, ప్రేమ్ సింగ్, వాణి సాంబశివరావు, సుజాత తదితరులు పాల్గొన్నారు.