శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆదర్శ్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద మొహర్రం పండుగను పురస్కరించుకుని కుల మతాలకు అతీతంగా అందరికీ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ షర్బత్ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ మొహర్రం అని అన్నారు. ఈ పవిత్ర దినం అందరికీ సుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముసలయ్య, దస్తగిరి, రమేష్, జగదీశ్, ఖాజా, గండయ్య రాములు, అబ్దుల్ ఘని, వెంకటేష్, సత్య, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.






