శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): పిఎస్ఎస్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవం సందర్భంగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి సహాయార్థం కోసం వచ్చిన పిఎస్ఎస్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ కి మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం రూ.50,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్స్, డైలీ వర్కర్స్ కుటుంబాలలో ఉన్నత చదువులు చదవడానికి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తూ వాళ్లకి ట్యూషన్ చెప్తూ పై చదువులు చదివిస్తూ మంచి కంపెనీలో జాబ్ వచ్చేంతవరకు వాళ్లకి ట్రైనింగ్ ఇస్తున్న పిఎస్ఎస్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎల్లప్పుడు సంస్థకి అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిర్యాల రాఘవరావు, పిఎస్ఎస్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పి శ్రీనివాస్, ట్రస్ట్ లో చదువుకుంటున్న విద్యార్థులు పాల్గొన్నారు.