శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) గ్రేటర్ హైదరాబాద్ 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి చందానగర్ పిజేఅర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం రక్తదానం చేసిన యువతి యువకులకు రాష్ట్ర టురిజం అభివృద్ధి సంస్థ మాజి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పిఎసి చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ కార్పొరెటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. చందానగర్ లో ఇంత పెద్ద ఎత్తున రక్త దాన శిబిరం ఏర్పాటు చేసిన ఐవిఎఫ్(IVF) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తాను అభినందించారు. IVF ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రాజేంద్రనగర్‌లోని ఆసుపత్రికి నాలుగు వేల యూనిట్ల రక్తాన్ని అందించామాని మరో నాలుగు రోజుల్లో వెయ్యి యూనిట్లు అందజేయనున్నామని తెలిపారు. అనంతరం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన వైశ్య సభ్యులకు ఉపాధి పరంగా, విద్యా పరంగా సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, గంప సత్యనారాయణ గుప్తా, దారం లక్ష్మయ్య గుప్తా, చిన్నం సత్యనారాయణ, కంచర్ల వెంకటేష్ గుప్తా, ఉట్కూరి శ్రీనివాస్ గుప్తా, గౌరీ శంకర్ గుప్తా, ముత్యాల శ్రీనివాస్ గుప్తా, పబ్బ శ్రీనివాస్ గుప్తా, సంపత్ గుప్తా, మురళి గుప్తా, జయకృష్ణ గుప్తా, ఐత భాస్కర్ గుప్తా, కోటేశ్వర రావు గుప్తా, పచ్చిపులుసు శ్రీనివాస్ గుప్తా, పృధ్వీ గుప్తా, మల్లికార్జున్ గుప్తా, కే వి గుప్తా, నటరాజు గుప్తా, సాయి బాబా గుప్తా, మారం వెంకట్ గుప్తా, ప్రభాకర్ గుప్తా, జయకిశోర్ గుప్తా, MS శ్రీధర్ గుప్తా, రాచూరి కృష్ణ, వినీత్ గుప్తా, గాయత్రి లలిత హెల్త్ క్యాంప్ కి హకరించిన డాక్టర్స్ బాండారి హాస్పిటల్స్ Dr Susruth, Dr PS రాహుల్, Dr N నీలిమ తదితరులు పాల్గొన్నారు.