స్విమ్మింగ్ ర్యాంకింగ్ పోటీలకు వేదిక హైదరాబాద్ : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి సారిగా స్విమ్మింగ్ ర్యాంకింగ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. స్విమ్మింగ్ పోటీల నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి గాంధీ తన నివాసంలో ఆవిష్కరించారు. డిసెంబరు 20 -23 వరకు గచ్చిబౌలి స్డేడియం స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించే ఈత పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఈతగాళ్లు పాల్గొనున్నారని అసోసియేషన్ ప్రతినిధులు విప్ గాంధీకి వివరించారు. దేశంలో మెట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్న పోటీలకు హైదరాబాద్ వేదిక కావడంతోపాటు క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సతీష్, సంజయ్, తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, కొండ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

స్విమ్మింగ్ పోటీల నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here