శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. మన్యం ప్రజలలో విప్లవ బీజాలు నాటి ప్రజలను చైతన్య పరిచి అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల చిన్న వయసుల్లోనే మన్యం ప్రజలను కలుపుకుని బ్రిటీషు పాలనను ఎదిరించిన గొప్ప యోధుడని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.