గోప‌న్‌ప‌ల్లిలో ఘ‌నంగా జగన్నాథ రథయాత్ర

శేరిలింగంప‌ల్లి, జూలై 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో ఉన్న GHMC మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఇస్కాన్ సైబరాబాద్ IVCC (ఇస్కాన్ వేదిక్ కల్చరల్ సెంటర్) ఆధ్వ‌ర్యంలో మొదటి శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమంలో మంత్రి కొండా సురేఖ‌, పీఏసీ చైర్మ‌న్ ఆరెక‌పూడి గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జగన్నాథుడిని భ‌క్తులంద‌రికీ క‌నిపించేలా వైభ‌వంగా ర‌థంపై ఊరేగించారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు తీర్థ ప్ర‌సాదాల‌ను సైతం అంద‌జేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here