శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తేలెత్తకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడుతామని జలమండలి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ లీకేజీతో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో బస్తీల్లో లీకేజీ సమస్య అధికమవుతున్నదన్నారు. దశలవారీగా మురుగునీటి లీకేజీ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. దీన్ని అదిగమించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలుషిత నీటి సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో శిథిలమైన మంచినీటి, డ్రైనేజీ పైపులైన్‌లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన కొత్త పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
డ్రైనేజీ సమస్య తీరిన వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతామని అన్నారు. అనంతరం సురభి కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో పారిశుధ్య కార్మికులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో శుభ్రం చేశారు. చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, HMWS & SB వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, పాపిరెడ్డి నగర్ అధ్యక్షుడు బద్దం కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాంబాబు, ఎంపీపీఎస్ హెచ్ఎం పాండురంగారెడ్డి, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజ్, లింగారెడ్డి, సురభి కాలనీ అధ్యక్షుడు శేఖర్,కోదండ రామ్, కుమార్, కొండల్ రెడ్డి, నయీమ్, ఆశ్రఫ్, నరసింహ, కొండల్ రావు, మహిళలు లక్ష్మి, కుమారి స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.