నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాకు సందర్శకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. చేనేత హస్తకళాకారులకు వారినుంచి చక్కని ప్రోత్సాహం అందుతున్నది. సంబల్పూరి భోందా, మేనియా చీరలు, జాంధానీ , రాజకోట, తంగలిగా, బనారసీ, కడ్వా, ఝాన్ద చీరలు, మూంగా, కాంత వర్క్, చెందేరి, డ్రీస్మటేరియల్స్, చీరలు, ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దెబోప్రియ బృందం కథక్ నృత్య ప్రదర్శన, పేరిణి శ్రీనివాస్ రావు శిష్య బృందం ఆంధ్రనాట్యం, లూయిటపోరియా అస్సామీ హైదరాబాద్ అసోసియేషన్ అస్సామీ సంప్రదాయ బిహు నృత్య, అస్సామీ పాటలు, అస్సామీ జానపద నృత్యాలు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన కళాకారులు జానపద నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.