శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను కాలనీవాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను కాలనీవాసులతో కలిసి పరిశీలించడం జరిగిందని, డ్రైనేజీ సమస్యను జలమండలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరిగిందని, కాలనీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, పొంగుతున్న మ్యాన్ హోల్ ల వద్ద పునరుద్ధరణ చేస్తామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని, కాలనీ వాసులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీవాసులు సుధాకర్ రెడ్డి, రామక్రిష్ణ వర్మ, బలరాం, రాము, మహేశ్వర్ రెడ్డి, దుర్గరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.