రెడ్డి సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి చేస్తాం – రెడ్డి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి – భవిష్యత్ కార్యాచరణ ఎజెండా కరపత్రం విడుదల

నమస్తే శేరిలింగంపల్లి: రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు తో పాటు రైతులు,‌ విద్యార్థులు, మహిళా సంక్షేమం కోసం రెడ్డి సంక్షేమ సంఘం కృషి చేస్తుందని రెడ్డి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి అన్నారు. హఫీజ్ పేట్ లోని జనప్రియ తెలంగాణ రాష్ట్రం రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భవిష్యత్ కార్యాచరణ ఎజెండా కరపత్రాన్ని బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు కైల దేవేందర్ రెడ్డి తో కలిసి నల్లా సంజీవ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్లా‌ సంజీవ రెడ్డి మాట్లాడుతూ రెడ్డిలకు న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి చైతన్యపరచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రెడ్డి సామాజిక వర్గానికి వర్తించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి రెడ్డిల ఐక్యతను చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు తావులేకుండా నిస్వార్థంగా రెడ్డిల అభ్యున్నతి ‌కోసం రెడ్డి సంక్షేమ సంఘం పాటుపడుతుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనకు, పేద రెడ్డి విద్యార్థులకు ఉన్నత చదువుల‌ కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేలా రెడ్డి సంక్షేమ సంఘం‌ కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ గున్నాల అనీల్ రెడ్డి, దుగ్గి రవీందర్ రెడ్డి. బ్రహ్మానందరెడ్డి, రాజిరెడ్డి, వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, కోటి రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సాయిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, గోవర్థన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, సుంకి సంజీవ రెడ్డి, తదితరులు పెద్ద ఎత్తున రెడ్డి బంధువులు పాల్గొన్నారు.

రెడ్డి సంక్షేమ సంఘం భవిష్యత్ కార్యచరణ కరపత్రాన్ని విడుదల చేస్తున్న సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here