శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో ఉన్న సఫైర్ హైట్ అపార్ట్మెంట్స్ కు చెందిన డాక్టర్ గంగవరపు శ్రీనివాసరావు, మహి మనవడు రిషన్ జన్మదినం సందర్భంగా హుడా ఆక్సిజన్ పార్క్ లో ఆట విడుపు (ప్లే ఐటమ్స్ ) పరికరాలను ఉచితంగా బహుకరించిన సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రిషన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, జన్మదినం వేడుకలు చేసుకోవడానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు అని, ప్రజలకు ఉపయోగపడే విధంగా రిషన్ జన్మదినం సందర్భంగా హుడా ఆక్సిజన్ పార్క్ లో ఆట విడుపు (ప్లే ఐటమ్స్ ) పరికరాలను ఉచితంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రిప్రగడ సత్యనారాయణ రావు, విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మణ్, రాజేందర్, వేణు గోపాల్, చారి, శ్రవణ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.