నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షునిగా కిరణ్ చారి ఎంపికయ్యారు. శివాజీ సేన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ చారికి భాగ్యనగరం రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షుడు పగడాల వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు.హిందూ సంఘటనలలో, ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలకైనా ఇచ్చిన పిలుపు మేరకు కిరణ్ చారి చురుగ్గా పాల్గొంటారని అన్నారు. శక్తివంచన లేకుండా ధర్మం కోసం పని చేసే వ్యక్తి, క్రమశిక్షణ గల వ్యక్తిగా కిరణ్ చారికి ఉన్న మంచి పేరుతో చందానగర్ డివిజన్ రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షునిగా ఎంపికయ్యారని అన్నారు.