శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ సీనియర్ నాయకులు కలివేముల వీరేశం గౌడ్ శనివారం సాయంత్రం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ తన బయోడేటాను అందజేశారు. ఐతే తన విజ్ఞప్తికి యువ నేత కేటీఆర్ సానుకూలంగా స్పందించారని, సర్వే జరిపించి ఆ ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. తనకు అవకాశం లభిస్తే భారీ మెజారిటీతో విజయం సాంధించగలనని వీరేశం గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.