శేరిలింగంపల్లిలో దంచికొట్టిన వాన

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఒకవైపు నిలిచిపోయిన రాకపోకలు

– మాదాపూర్ లో అత్యధికంగా 66 మి.మి వర్షపాతం
– లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిని ముంచెత్తిన వరద నీరు

చందానగర్ ( నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో శనివారం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం సాయంత్రానికి రెట్టింపు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్ లో అత్యధికంగా 66 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా రాయదుర్గం, లింగంపల్లిలో 43 మి.మి లకు పైగా వర్షం కురిసింది. దీంతో ఎప్పటిలాగే లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది.

శేరిలింగంపల్లి లో నమోదైన వర్షపాతం ఇలా…!

ప్రాంతం                           వర్షపాతం(మి.మి)
మాదాపూర్( హైటెక్ సిటీ)            66.0
రాయదుర్గం(వార్డు ఆఫీస్)           43.8
లింగంపల్లి (ఎంఎంటీఎస్)           43.3
ఖాజాగూడ(స్పోర్ట్స్ కాంప్లెక్స్)        38.3
హఫీజ్ పేట్(ఆరోగ్యకేంద్రం)         32.5
కొండాపూర్(నేరెళ్ల పార్క్)             31.8
జేపీ నగర్(కమ్యూనిటీ హాల్)         26.3
చందానగర్(పీజేఆర్ స్టేడియం)      20.8

ఇన్ స్పెక్టర్ సుమన్ నేతృత్వంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఒక వైపు మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచి పోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు ట్రాఫిక్ ఇటు జిహెచ్ఎంసి, అధికారులు సకాలంలో స్పందించడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. శనివారం రాత్రి మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ నేతృత్వంలో లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. చందానగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను లింగంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా నల్లగండ్ల ఫ్లై ఓవర్ వైపు మరలించారు. దింతో కొద్ది సమయంలోనే ట్రాఫిక్ జామ్ కి తెరపడింది.

వరద నీరుతో ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్ చుట్టూ బారికేడ్లు పెట్టిస్తున్న మియాపూర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సుమన్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here