నమస్తే శేరిలింగంపల్లి: రెడ్డిల అభ్యున్నతి కోసం రాష్ట్ర స్థాయిలో ఒకటే రెడ్డి సంఘం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా సంజీవ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని నానక్ రాంబగూడ చిత్తారమ్మ దేవాలయ ప్రాంగణంలో రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. నానక్ రాం గూడ రెడ్డి సంఘం అధ్యక్షుడు సూరారం గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా సంజీవ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రెడ్డీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పేద రెడ్లు, విద్యార్థులు, రైతుల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రెడ్డి సంఘం ఉండేలా పెద్దలు చొరవ తీసుకుని చర్చించి ఏకం చేయాలని కోరారు.
రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, రెడ్డీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రెడ్డి వార్ ఎజెండా విడుదల చేశారు. కైల దేవేందర్ రెడ్డి, సూరారం గోపాల్ రెడ్డి, ముత్యంరెడి,రాజు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్ గున్నాల అనీల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండవీటి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, కార్యదర్శి శేరి అంతి రెడ్డి, సహాయ కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ రెడ్డి, మియాపూర్ అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, చందానగర్ సంఘటనా కార్యదర్శి మోహన్ రెడ్డి అధిక సంఖ్యలో రెడ్డి సోదరులు పాల్గొన్నారు.