నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల వద్ద ఆయుర్వేద ఔషద మొక్కలను నాటాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో గృహ మూలిక వనం- గృహ వైద్యం- ఆయుర్వేద ఔషద మొక్కలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై ఒక్కో ఇంటికి 20 రకాల ఔషద మొక్కలను తెలంగాణ స్టేట్ మెడిసిన్ ప్లాంట్ బోర్డు అధికారులతో కలసి స్థానిక కాలనీ ప్రజలకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేదం, ఔషద మొక్కలు, గృహ వైద్యం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్క మొక్క కూడా ఔషద మొక్క అని అన్నారు.
ఎటువంటి దుష్పలితాలు లేని మందులు కేవలం ఆయుర్వేదమే అని అన్నారు. పెద్ద పెద్ద రోగాలకే కాకుండా గృహ వైద్యానికి సైతం ఆయుర్వేదం ఔషద మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఆయుర్వేద ఔషద మొక్కలు ఇంట్లోనే పెంచుకొని, చిన్న చిన్న రోగాలకు, తదితర సమస్యలకు క్రమం తప్పకుండా వాడితే రోగాలు దూరం అవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఈ ఔషద మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ మెడిసిన్ ప్లాంట్ బోర్డు అధికారులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొహ్మద్ రఫీయుద్దీన్, ఫీల్డ్ ఆఫీసర్ కె. జయసింహా, సబ్ ఆర్డినేటర్ ఆంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రక్తపు జంగం గౌడ్, విజయ్ కృష్ణ, ఊట్ల దశరద్, రక్తపు లక్ష్మణ్ గౌడ్, నరసింహా, శివ, లక్ష్మిపతి రెడ్డి, నాగేశ్వరరావు, సాయి శామ్యూల్ కుమార్, సుబ్బారావు, శ్రీహరి, విజయ్, మధు తదితరులు పాల్గొన్నారు.