నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో 5 వ విఢత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు.
పట్టణ ప్రగతిలో ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, డివిజన్ పరిధిలోనీ బస్తీలలో, కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యమన్నారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతి, ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ మహేశ్వరి, శానిటేషన్ ఎస్అర్ పి ప్రసాద్, స్థానిక నాయకులు, టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు నాగేశ్వర్ రావు, సంజీవ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, ఆదినర్సింహా రెడ్డి, సాంబయ్య, ప్రభాకర్, వార్డు సభ్యులు శ్రీనివాస్, పితాని లక్ష్మీ, మాజీ వార్డ్ సభ్యురాలు లక్ష్మీ, మల్లారెడ్డి, సత్యం, రామ్మోహన్ రావు, ప్రకాష్ రెడ్డి, వీర రెడ్డి, రవి బాబు, రాజేందర్ రెడ్డి, అప్పారావు, బ్రహ్మానంద రెడ్డి, నాగభూషణం, దుర్గారావు, రాజు, శ్రీనివాస్, శానిటేషన్ సభ్యులు, వర్క్ ఇన్‌స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో…
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్, రాజీవ్ నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్ ఐదో విఢత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బస్తీలో ఉన్న చెత్తను తొలిగించటం, డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికతీత పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం పట్టణ ప్రగతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓ హెల్త్ డాక్టర్ కార్తిక్, డీఈ సురేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, ఏఈ ప్రతాప్, శానిటేషన్ ఎస్ఆర్పీ గంగారెడ్డి, మహేష్, హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వార్డు సభ్యులు శేఖర్ ముదిరాజ్, కనకమామిడి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ గౌడ్, సుధాకర్, లక్ష్మణ్, హమీద్, అఫ్సర్, అక్బర్, నర్సింహా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కంది జ్ఞానేశ్వర్, నాగరాజ్, కృష్ణ, సుదేశ్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.