శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గోపీనగర్ సెక్టార్‌లో ఉన్న లింగంపల్లి హై స్కూల్‌లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో పలువురు అతిథులు విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాల నిరోధానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కట్టయ్య, ప్రధానోపాధ్యాయురాలు శైలజ, సూపర్ వైజర్‌లు మాధురి, కోమలి, పోలీసు సిబ్బంది అశోక్, శ్రీశైలం, బస్తీ దవాఖాన డాక్టర్, అంగన్ వాడీ టీచర్లు జి.నాగమణి, సుజాత, రజిని, జ్యోతి, ప్రవీణ, ఉమా, సువర్ణ, సరస్వతి, యశోద, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.