శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీ లోని క్రిష్ణ సాయి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీ లోని క్రిష్ణ సాయి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వాసులు తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను స్వయంగా కాలనీలో పర్యటించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని అన్నారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తిచేస్తామని, మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుప్రజ, కృష్ణ సాయి అపార్ట్మెంట్ అసోసియేషన్ వాసులు శేషు, బాలమురళి, సుధీర్, నవీన్, సంజయ్ కర్ణిక్ తదితరులు పాల్గొన్నారు.