రెజ్ల‌ర్ల‌ను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ రెజ్లింగ్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, తెలంగాణ రాష్ట్ర బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాద‌వ్ మాట్లాడుతూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ త‌న పేరు మీద గడ్డం గంగాధర్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్య పరంగా సహకారం అందిస్తున్నార‌ని కొనియాడారు. యువత విద్య వైద్య ఆరోగ్య వ్యాపార రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా రాణించాలని అన్నారు. యువతకు రాజకీయ శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. రెజ్ల‌ర్ల‌ను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి యాదవ్, మాజీ ఎంపీ మాజీ హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్, మ‌ల్లా రెడ్డి, శీను యాదవ్, శ్రీనివాస్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here