శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత స్థాయిలో ప్రతిష్టాత్మకమైన నీట్ -2025 పరీక్షలో ఓపెన్ క్యాట గిరిలో 18వ ర్యాంకు, రెండు తెలుగు రాష్టాలలో 1 వ ర్యాంకు, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మార్కులతో 670/720, సాధించిన మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీనగర్ కాలనీ కి చెందిన కాకర్ల – జీవన్ సాయి కుమార్ ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నీట్ పరీక్షలో తెలుగు రాష్ట్రాలలో మొదటి ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. మన ప్రాంత వాసి కావడం మనందరికీ గర్వకారణం అని, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అని అన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు అని, నేటి యువతకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. జీవితంలో గొప్పగా రాణించాలంటే ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని అటువైపుగా అడుగులు వేయాలని, సడలని పట్టుదల, మంచి క్రమశిక్షణ, సాధించాలనే తపన , కఠోర శ్రమతో అద్భుత ఫలితాలు సాధించవచ్చు అనడానికి జీవన్ సాయి కుమార్ నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ సాయి కుమార్ తండ్రి గంగాధర నాగ కుమార్, మాతృ శ్రీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కావూరి అనిల్ , సెక్రెటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.