శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో రూ.3,58,000 చెక్కులను బాధిత కుటుంబాలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్ లలో ప్రజలు అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన అనంతరం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి, వారికి మంజూరైన చెక్కులను నియోజకవర్గ నాయకులతో కలిసి బాధితులకి జగదీశ్వర్ గౌడ్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి, నియోజకవర్గ నాయకులు వీరేందర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, శేఖర్ ముదిరాజ్, ఏకాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రేణుక, బాష్పాక యాదగిరి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు కల్పన గౌడ్, రాజేష్, విక్రమ్ చారి, రాంచందర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, రవి కుమార్ గౌడ్, సుధాకర్, లింగం, వెంకట్ రెడ్డి, వెంకన్న, తిరుపతి, నవీన్, శంకర్, వాసు, మధు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరలు పాల్గొన్నారు.