నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదని అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. అవని స్వచ్చంద సంస్థ సభ్యులు యశ్వంత్ జూలూరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న ఒక పేద వికలాంగ మహిళావీరమణి కి జీవనోపాధి కోసం రూ. 5 వేల విలువైన ఇస్త్రీ పెట్టెను కార్పొరేటర్ డి. వెంకటేష్ గౌడ్, అవని స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ చేతుల మీదుగా విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యువనేత రామకృష్ణ గౌడ్, అవని సభ్యులు సమ్మా రెడ్డి, వాసుదేవ రావు, వహీదా, సంగమేష్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.