శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర్ నగర్ కు చెందిన బాలింగం ఇటీవల అనారోగ్యం కారణాలవల్ల ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయాన్ని నియోజకవర్గం నాయకుడు ఏకాంత్ గౌడ్ దృష్టికి తీసుకురావాడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ని సంప్రదించి ఆయన సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 60,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు భాషిపాక యాదగిరి, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేందర్, వెంకటేష్, మునిశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.