శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి (NH65) శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్ పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే 2.7 KM పొడవుతో 4 లేన్ రహదారి విస్తరణ, 2 లేన్ సర్విస్ రహదారి విస్తరణ పనులకు ఐటీ , పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, డీసీ మోహన్ రెడ్డిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1650 కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, శేరిలింగంపల్లి నియోజకవర్గంను అగ్రభాగాన నిలబెడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ అధికారులు SE శ్రీ లక్ష్మీ, EE నామ్యా, DE హరీష్ బాబు, AE శివ కృష్ణ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు నాయకులు , కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.