శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన సహాయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు,GHMC స్టాండింగ్ కమిటీ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ లో నివాసముంటున్న అమూల్య అనే లబ్ధిదారులకు చెక్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు తాత్కాలిక ఆర్థిక భద్రతను అందించే శక్తివంతమైన సాధనం అని అన్నారు. మానవతా దృక్పథంతో ఈ సహాయం పొందిన ప్రతి కుటుంబానికి ఇది కొంత ఊరటను ఇస్తుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లా సంజీవ్ రెడ్డి, వీరమల్ల వీరేందర్ గౌడ్, తిరుపతి, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, మానేపల్లి సాంబశివరావు, దోర్నాల రవికుమార్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, ప్రభాకర్ గౌడ్, రేణుక, సరస్వతి, కవిత, శంకర్ గౌడ్, నవీన్, అశోక్ గౌడ్, భాషిపాక యాదగిరి, దొంతి శేఖర్, పరుశురాములు, డాన్ వెంకట్, సింహా, శ్రీకాంత్ పాల్గొన్నారు.