శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ సూచించారు. పోస్టాఫీస్‌లో అకౌంట్ తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి పథకం కింద నగదు జమ చేస్తుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, అంతా పుకారేనని అన్నారు. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, డబ్బులు నష్టపోవద్దని ఆమె సూచించారు.