శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలో ఏనుగల్లు ఎన్ జి తండాకు చెందిన అసావత్ బాలోజి (32) హెల్పర్ గా పని చేస్తున్నాడు. విద్యుత్ పనులు చేయడానికి పిలిపించి 11కేవీ ఓల్టేజ్ కలిగిన విద్యుత్ పోల్స్ పై అసవత్ బాలోజినీ అధికారులు కరెంట్ స్తంభాలపై ఎక్కించారు. ఎల్ సి తీసుకోకుండా ఉన్నందున అసావత్ బాలోజి ప్రమాదానికి గురయ్యాడనీ స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికులు వెంటనే అసావత్ బాలునీ 108 వాహనంలో వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రి కి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లగా వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం తీవ్రంగా గాయపడినందున అతని రెండు కాళ్ళు తీసేశారు. అలాగే కుడి చేతి కి కూడా తీవ్రంగా గాయం అయిందని వైద్యులు తెలిపారు. అది మెరుగుపడనందున ఆ చేతిని కూడా తీసివేసినట్లు యశోద వైద్యులు తెలిపారు. ఇంతటి ప్రమాదానికి కారణమైన విద్యుత్ అధికారులు ఎడి తిరుపతి, ఎఈ విజయ్ కుమార్, లైన్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబులపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రభుత్వం అతని ఆరోగ్య ఖర్చులు, కుటుంబానికి కోటి రూపాయల ఆర్ధిక సహాయంతో పాటు అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని బంధువులు డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్..
విద్యుత్ షాక్ ప్రమాదానికి గురి అయి హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అసావత్ బాలోజిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరామర్శించారు. అతని కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇచ్చి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చూస్తాం అని హామీ ఇచ్చారు.