అధికార‌ పార్టీ నాయ‌కుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను చూస్తూ ఉరుకునేది లేదు: బిజెపి రాష్ట్ర నాయ‌కులు రవికుమార్ యాద‌వ్‌

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను, స్మశాన వాటికలను, పార్కు స్థలాలను ఇష్టారీతిగా ఆక్రమించి కబ్జాలకు పాల్పడుతున్నారని బీజేపీ‌ నాయకులు రవికుమార్ యాదవ్ మండిప‌డ్డారు. కొండాపూర్ డివిజ‌న్‌ సిద్దిఖ్ నగర్ బస్తీలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ముస్లింలు తమ దర్గా కు సంబంధించిన స్థలమని నకిలీ సర్టిఫికేట్లను సృష్టించి‌ భయభ్రాంతులకు‌‌ గురిచేస్తున్నారని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విచారణకు‌ వచ్చిన రెవెన్యూ సిబ్బందిని‌ బెదిరిస్తున్నారని స్థానిక బస్తీ వాసులు వాపోయారు. ఈ అంశాన్ని బీజేపీ రాష్ట్ర‌ నాయకులు రవి కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. బస్తీవాసుల అభ్య‌ర్థ‌న‌ మేరకు రవికుమార్ యాదవ్ శ‌నివారం సిద్దిఖ్ నగర్‌లో ప‌ర్య‌టించి, ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. స‌ద‌రు స్థ‌లం కబ్జాకు గురికాకుండా చూస్తామని బస్తీ వాసులకు‌ ఆయన హామినిచ్చారు. తహసీల్దారు, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఇక్కడి మహిళల కోసం మహిళా‌భవన్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు క‌ర్చ‌ర్ల‌ ఎల్లేష్ , సరోజ రెడ్డి, లక్ష్మీ బాయి, రేఖ , బసవరాజ్, రవికుమార్, గోపి, చందు తదితరులు‌ ఉన్నారు.

ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని బీజేపీ‌ నాయకులు రవికుమార్ యాదవ్ కు విన్నవిస్తున్న బస్తీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here