నమస్తే శేరిలింగంపల్లి: అహ్లాదకరమైన వాతావరణంతో మయూరీనగర్ ఎంజెన్ పార్కును సుంధరీకరణ చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో రూ. 2 కోట్ల నిధుల అంచనా వ్యయంతో ఎంజెన్ పార్క్ లో చేపట్టిన సుందరికరణ, అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డీసీ సుధాంష్‌తో కలిసి శనివారం గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మయూరినగర్‌తో పాటు చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఈ థీమ్ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యువత కోసం జిమ్, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పార్కు సుంధరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ రూపదేవి, ఏఈ ధీరజ్ వర్క్ ఇన్ స్పెక్టర్లు విశ్వనాథ్, జగదీష్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు శ్రీనివాసరావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.