అధికారుల అలసత్వమే ప్రజలకు శాపం: బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కర రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ హైవేపై ఓపెన్ డ్రైన్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా అధికారుల అలసత్వం, ప్రణాళికా లోపం ప్రజల ప్రాణాలకు శాపంగా మారుతుంద‌ని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి వాపోయారు. స్థానికుల అభ్య‌ర్థ‌న‌ మేరకు శనివారం చందానగర్ హైవేపై ఓపెన్ డ్రైన్ ను ఆయన పరిశీంచారు. చందానగర్ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు దీర్ఘకాలికంగా జరగడం, ఓపెన్ డ్రైన్ పూర్తిగా శిథిలమై పని చేయకపోవడంతో ప్రజలకు శాపంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిసి సుధాంషు దృష్టికి తీసుకువెళ్లి ప్రమాదకరంగా ‌ఉన్న ఓపెన్ డ్రైన్ కు మరమ్మతులు చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

చందానగర్ ఓపెన్ డ్రైనేజీ ని పరిశీలిస్తున్న కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here