నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసి ప్రజలందరికీ వీలైనంత త్వరగా అందజేయాలని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్ అండ్ టి సెరీన్ కౌంటీ లో గల క్లబ్ హౌజ్‌లో కాంటినెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాధరరెడ్డి మాట్లాడుతూ సెరీన్ కౌంటీ వాసులు వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలకు వ్యాక్సిన్ సులభంగా దొరుకుతుందన్నారు. ఎక్కువ మంది ప్రజలు నివసించే గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో ఇటువంటి వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ టీ సెరీన్ కౌంటీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
