నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏటీఎం చోరి ఘటన చోటుచేసుకోగా గంటలోపు పోలీసులు కేసును చేధించారు. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం… నల్లగండ్లలోని అపర్ణ జెనిత్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో చోరి ఘటన చోటు చేసుకుంది. దుండగులు మిషన్‌తో సహా మొత్తం రూ.6.50 లక్షలు దోచుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిన గంటలోపు కేసు చేధించారు. చోరికి పాల్పడింది నల్లగండ్ల ప్రాంతంలో నివాసం ఉండే ఎలక్ట్రిషన్ రాజుగా గుర్తించారు. స్థానిక హుడా లేఅవుట్‌లో ఏటీఎం మిషన్‌లోని భాగాలను పగుల గొడుతుండగా చందానగర్ పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరికి గురైన మొత్తం సోత్తును రికవరీ చేశారు. చోరికి ఉపయోగించిన స్క్రూ డ్రైవర్‌తో పాటు పలు పనిముట్లను స్వాదీనం చేసుకున్నారు. రాజుపై గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేనప్పటికి ఏకంగా ఏటింఎం మిషన్‌ను ఎత్తుకెళ్లడం విశేషం. ఐతే అలర్ట్ వచ్చిన గంటలోపు కేసును చేధించిన చందానగర్ పోలీసులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

