నమస్తే శేరిలింగంపల్లి: నిరుపేద ప్రజలకు పలు సామాజిక సేవా కార్యక్రమాలతో అండగా నిలుస్తున్న ఆయువ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అసోసియేషన్ వ్యవస్థాపకులు రోహిత్ ముదిరాజ్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల క్రితం నలుగురు సభ్యులతో ప్రారంభమై నేడు 170కి పైగా సభ్యులతో అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు, అన్నార్థులకు, వికలాంగులకు తమస్థాయిలో అండగా నిలిచామని తెలిపారు. భవిష్యత్తులో తమ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అసోసియేషన్ మాజీ చైర్మెన్ దివంగత శ్యామ్ జయంతి సందర్భంగా ఆయనకు సభ్యులు నివాళులర్పించారు.
