నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ రూ. 4 కోట్ల 58 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ , శంకుస్థాపన చేశారు.
- గోకుల్ ప్లాట్స్ కాలనీ లో రూ.2 కోట్ల 79 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
- మాతృ శ్రీ నగర్ కాలనీ లో రూ.50 లక్షల అంచనా వ్యయంతో ఫుట్ పాత్ , టేబుల్ డ్రైన్ నిర్మాణ పనులు.
- శిల్ప పార్క్ కాలనీలో రూ.18.50 లక్షల అంచనా వ్యయంతో ఓపెన్ జిమ్ నిర్మాణ పనులు.
- చంద్ర నాయక్ తండా, సాయి నగర్, అయ్యప్ప సొసైటీ కాలనీలలో రూ.111 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈ శ్రీనివాస్ గౌడ్, గోకుల్ ప్లాట్స్ బిఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు బి.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సాంబశివరావు, ఎస్.సి సెల్ అధ్యక్షుడు రఘునాథ్, డివిజన్ నాయకులు అన్వర్ షరీఫ్, ఎంవివి నారాయణరెడ్డి, వార్డ్ సభ్యులు శ్రీనివాస్, పితాని లక్ష్మీ, రామచందర్, తైలి కృష్ణ, కేశవులు, మోహన్, కృష్ణ రెడ్డి, పితాని శ్రీనివాస్, ప్రసాద్, రామ్మోహన్, సురేష్, చౌదరి, నీలకంఠ, మూర్తి, అనిల్ కావూరి, వెంకట్ రెడ్డి, లాలూ నాయక్, హున్య నాయక్, నర్సింహ, రాములు, జైపాల్, సుబ్రమణ్యం, శ్రవణ్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, రాజేష్, రాజు, సత్తిరెడ్డి, ప్రవీణ్, కుమార్, నవీన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.