శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): ట్రాక్టర్ ఓనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శేరిలింగంపల్లి సీపీఐ నాయకుడు రామకృష్ణ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. రాంకీ సంస్థ ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని, ఒక ట్రాక్టర్ డిస్మెంటల్ 350 రూపాయలు ఉన్న ధరను. 850 రూపాయలకు పెంచిన రాంకీ సంస్థ కస్టమర్లు అంత రేటు ఇవ్వక, పెరిగిపోయిన డీజిల్ రేట్లు, ట్రాఫిక్ చలాన్లు, పెరిగిన లేబర్ చార్జీలతో సతమతమవుతున్నారని అన్నారు. రేట్లు పెంచి ట్రాక్టర్‌లను అమ్ముకునే పరిస్థితిని తెచ్చారని అన్నారు. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్ల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఇందుకు జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి. శ్రీకాంత్, ఎల్లప్ప పాల్గొన్నారు.