శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): బర్కత్ పురా నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన ఉన్న బిసి కార్యాలయంలో గడ్డం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడ్డం పొలిటికల్ అకాడమీని ప్రారంభించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి నుండి జి హెచ్ ఎం సి మేయర్ వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని కూతుహలం ఉన్న యువత ఎవరైనా సరే బీసీకి చెందినవారు ఈ పొలిటికల్ అకాడమీ ట్రైనింగ్ లో పాల్గొనవచ్చని చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.అగ్రవర్ణాల వాళ్లే అధికారంలో ఉంటూ సామాజిక న్యాయం బీసీలకు దక్కకుండా చేస్తున్నారని, బీసీ సామాజిక వర్గాలైన 135 బిసి కులాలు తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి ఉత్సాహం ఉన్న యువత గాని, నాయకులు గాని ఈ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీ లందరూ ఏకం కావాలని ఐకమత్యంతో అధికారమే అంతిమ లక్ష్యంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకుందామని, ఓబిసి ప్రజలకు, బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు, గొల్ల ప్రసాద్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి బీసీ అధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్, వినోద్ యాదవ్, కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, శివకుమార్ ప్రసాద్, శ్రీనివాస్ యాదవ్, గరికే శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.